Dil Raju ఇటీవల విడుదలకు సిద్దమవుతున్న “జనక అయితే గనక” సినిమా ప్రెస్ మీట్లో ఇంట్రస్టింగ్ వ్యాఖ్యలు చేశారు. రిపోర్టర్ ఒక ప్రశ్న అడిగారు, ఆయన డిస్ట్రిబ్యూషన్ రంగంలో కాస్త స్లో అయినట్టు కనిపిస్తున్నారని అడగగా, ఈ సందర్భంలో డిల్ రాజు తనదైన శైలిలో స్పందించారు.
“నేను సచిన్ టెండూల్కర్ లాంటివాడిని,” అంటూ డిల్ రాజు వ్యాఖ్యానించారు. “సచిన్ ఆడేటప్పుడు బాగా పరిశీలిస్తాడు… లూస్ బాల్ కోసం వెయిట్ చేస్తాడు.. . అలాగే, నేను కూడా సరైన సమయం కోసం ఎదురు చూస్తున్నాను. ఒకసారి ఆ బంతి లభిస్తే, అది సిక్సర్ అవుతుంది. ప్రస్తుతం నేను పరిస్థితులను ఆరా తీస్తున్నాను, నా ప్రొడక్షన్ హౌస్ ఇక్కడ ఉంటుంది, సినిమాలు చేస్తాం.” అని వివరించారు
“జనక అయితే గనక ” చిత్రం డిల్ రాజు ప్రొడక్షన్స్‌లో రూపొందింది, ఇందులో సుహాస్ హీరోగా నటిస్తున్నారు. డిల్ రాజు ప్రొడక్షన్స్, దిల్ రాజు కూతురు హన్షిత రెడ్డి ప్రారంభించిన సంస్థ. తమ తొలి చిత్రం “బలగం” తో పెద్ద విజయం సాధించిన ఈ సంస్థ, ఇప్పుడు “జనక అయితే గనక” తో కూడా మంచి హిట్ కొట్టాలని చూస్తుంది.
సుహాస్ ప్రస్తుతం మంచి ఫార్మ్‌లో ఉన్న ఉపకమింగ్ యాక్టర్. సెప్టెంబర్ 7న విడుదలయ్యే ఈ సినిమాతో మంచి విజయవామ్ సాధించాలని ఆశిద్దాం