తెలుగు సినీ పరిశ్రమలోనే కాకుండా మహేష్ బాబు కెరీర్ లో కూడా మురారి ఒక మరుపురాని ఘట్టం. మహేష్ బర్త్డే సందర్భంగా ఈరోజు సినిమాను రీ- రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. కొత్త సినిమా రిలీజ్ లాగ ఉదయం 7 గంటలు నుంచే ఫ్యాన్స్ షోలు వేసి థియేటర్ల దగ్గర హుంగామ సృష్టించారు మహేష్ ఫ్యాన్స్. కొంతమంది అభిమానులు ఉత్సాహంతో, తెలుగు రాష్ట్రాల్లోని పలు థియేటర్లు వివాహ హాళ్లుగా మార్చేశారు. కొబ్బరి తోరణాలు, మామిడాకులతో థియేటర్ల గుమ్మలను అలంకరించి, ఇవి థియేటర్ల, పెళ్లి మండపాల అన్నట్టు చేశారు
Read Also: Olympics 2024: 40ఏళ్ళ తరువాత పాకిస్తాన్ కు స్వర్ణం, భారత్ కు సిల్వర్
మురారి లో సినిమా ఎంత బాగుంటుందో, పాటలు అంతకంటే బాగుంటాయి. ముఖ్యంగా చందామామా పెళ్లి సాంగ్ ఒక ట్రెండ్ సెట్టింగ్ సాంగ్. వైజాగ్ లో ఒక థియేటర్లో ఒక అభిమాని మురారి పెళ్లి సాంగ్ ప్రదర్శించే టైం లో అందరికి అక్షింతలు పంచాడు. ఈ వీడియో ఇంటర్నెట్ లో వైరల్ అవుతుంది. నవ్వులు పూయిస్తున్న ఈ వీడియోను అందరూ షేర్ చేస్తున్నారు
మొత్తానికి మహేష్ బర్త్డే కి మురారి రూపం లో మహేష్ ఫాన్స్ చాలా ఖుషీగా ఉన్నారు. కొత్త సినిమా అప్డేట్ లేదనే బాధను మర్చిపోయేలా చేసింది బాబు మురారి… రాజమౌళి తో సినిమా రెండేళ్లు పడుతుంది కాబట్టి అతడు, ఖలేజా కూడా రాబోయే సంవత్సరాల్లో రి రిలీజ్ ప్లాన్ చేసే ఆలోచనల్లో ఉన్నారు