TG: జగిత్యాల జిల్లాలో విషాదం జరిగింది. రాయికల్ మండలం మైతాపూర్లో అక్షయ్(16) అనే పదో తరగతి విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అక్షయ్.. ఇటీవల చదువుపై నిర్లక్ష్యం చూపుతున్నాడని పాఠశాల HM.. ‘ఇలా ఉంటే పదవ తరగతి ఫెయిల్ అవుతావ్’ అని మందలించాడట. దీంతో మనస్థాపానికి గురైన విద్యార్థి.. గత నెల 26న పురుగుల మందు తాగాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ ప్రాణాలు వదిలాడు.