Manoj Soni: యూపీఎస్సీ చైర్మన్ మనోజ్ సోనీ రాజీనామా
పూజా ఖేడ్కర్ అనే యువతి తప్పుడు సర్టిఫికెట్లతో సివిల్స్‌కి ఎంపిక అయ్యింది. ట్రైనింగ్‌లో ఉండగా ఆమె చేసిన కొన్ని తప్పుల వల్ల ఫేక్‌గా సివిల్స్ సాధించిందని సందేహాలు మొదలయ్యాయి. అయితే తాజాగా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ మనోజ్ సోనీ రాజీనామా చేశారు.
Manoj Soni: ఈ మధ్య నీట్ పేపర్ లీక్ కావడం, యూజీసీ నెట్ పరీక్ష రద్దు వంటి వ్యవహారాలు దేశవ్యాప్తంగా సంచలనం రేపాయి. పేపర్ లీకేజీలతో వారి సమయం వృథా చేశారంటూ కేంద్రంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఆ తర్వాత యూపీఎస్సీ కూడా వివాదంగా మారింది. పూజా ఖేడ్కర్ అనే యువతి తప్పుడు సర్టిఫికెట్లతో సివిల్స్‌కి ఎంపిక అయ్యింది. ట్రైనింగ్‌లో ఉండగా ఆమె చేసిన కొన్ని తప్పుల వల్ల ఫేక్‌గా సివిల్స్ సాధించిందని సందేహాలు మొదలయ్యాయి. అయితే తాజాగా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ మనోజ్ సోనీ రాజీనామా చేశారు. ఐదేళ్ల పదవీకాలం ఉండగానే ఆయన రాజీనామా చేయడంతో అందరిలో సందేహం మొదలవుతుంది.
వ్యక్తిగత కారణాలతో అతను రాజీనామా చేసినట్లు సమాచారం. గతేడాది ఏప్రిల్‌లోనే చైర్మన్‌గా మనోజ్ బాధ్యతలు చేపట్టారు. ఇంకా ఐదేళ్ల పదవీకాలం ఉంది. అయినా కూడా ఆయన రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను ఉన్నతాధికారులు ఇంకా ఆమోదించలేదు. పూజా ఖేడ్కర్ నియామక ప్రక్రియలో లోపాలు ఉన్నట్టు బయటపడటంతో చైర్మన్ రాజీనామా చేశారంటూ పుకార్లు వచ్చాయి. అయితే పూజా ఎంపికకు, ఈ రాజీనామాకు సంబంధం లేదని సమాచారం. ఓబీసీ అర్హత లేకపోయినా ఆమె క్రిమిలేయర్ సర్టిఫికెట్ సంపాదించడంతో పాటు అంగవైకల్యం ఉన్నట్టు మరో తప్పుడు సర్టిఫికెట్ సృష్టించారు. వీటిని యూపీఎస్సీ గుర్తుపట్టలేకపోవడం గమనార్ధం.