నల్గొండ అదనపు ఎస్పీ రమేష్ ఆధ్వర్యంలో వన్‌టౌన్ పోలీసులు పోగొట్టుకున్న, దొంగతనానికి గురైన 60 మొబైల్ ఫోన్లను సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో రికవరీ చేసి బాధితులకు అందజేశారు. మొబైల్ పోగొట్టుకున్న వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని, CEIR పోర్టల్‌లో నమోదు చేయాలని అదనపు ఎస్పీ సూచించారు. ఫోన్లు తిరిగి పొందిన బాధితులు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.