Old Woman Murdered : ఆంధ్రప్రదేశ్లోని వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరులో ఘోరమైన హత్య జరిగింది. అక్కడ నివాసం ఉంటున్న బాల నాగమ్మ(65) అనే వృద్ధురాలిపై(OLD WOMAN ) దుండగుడు కర్కశత్వాన్ని చూపాడు. ఆమెపై పెట్రోల్(PETROL) పోసి నిప్పంటించాడు. దీంతో మంటలకు తాళలేక ఆమె గట్టి గట్టిగా కేకలు వేసింది. ఆ తర్వాత మృతి చెందింది. చుట్టు పక్కల వారు ఈ విషయాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు.
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కాలిన దేహంతో ఉన్న ఆమెను జిల్లా ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ఆమెను పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు తేల్చారు. దీంతో దుండగుడిపై హత్య (Murder ) కేసు నమోదు చేశారు. పోలీసుల దర్యాప్తులో తెలిసిన వివరాలు ఇలా ఉన్నాయి. నాగమ్మ కొడుకు సురేష్ మూడు నెలల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు. కడప వాస్తవ్యురాలైన నాగ ఉషను ప్రేమించాడు. అందుకు ఆమె తరఫు వారు ఒప్పుకోలేదు.
దీంతో వారిని ఎదిరించి పెళ్లి చేసుకునేందుకు సురేష్ ప్రయత్నించాడు. అందుకు సురేష్ తల్లి నాగమ్మ సైతం సహకరించింది. అలా వారి పెద్దలను ఎదిరించి అతడు పెళ్లి చేసుకున్నాడు. అప్పటి నుంచి యువతి ఇంటి వారు వీరితో మాట్లాడటం లేదు. ఆమె కుటుంబ సభ్యులే నాగమ్మను హత్య చేసి ఉంటారని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.