»Murder Aunt Killed Daughter In Law For Not Making Tea
Murder: టీ పెట్టలేదని కోడలిని చంపిన అత్త
అత్తాకోడళ్ల మధ్య చీటికి మాటికి వివాదాలు జరుగుతుంటాయి. ఆ వివాదాలు పెరిగి చివరికి మరణాల వరకు కూడా దారితీస్తాయి. తాజాగా ఓ అత్తకోడళ్ల మధ్య ఛాయ్ వివాదం మరణం వరకు తీసుకెళ్లింది.
Murder: Aunt killed daughter-in-law for not making tea
Murder: అత్తాకోడళ్ల మధ్య చీటికి మాటికి వివాదాలు జరుగుతుంటాయి. ఆ వివాదాలు పెరిగి చివరికి మరణాల వరకు కూడా దారితీస్తాయి. తాజాగా ఓ అత్తకోడళ్ల మధ్య ఛాయ్ వివాదం మరణం వరకు తీసుకెళ్లింది. వివరాల్లోకి వెళ్తే.. వికారాబాద్ జిల్లా మోమిన్‌పేట మండలం టేకులపల్లి గ్రామానికి చెందిన అజ్మీరాబేగంకు హసన్‌నగర్‌కు చెందిన అబ్బాస్‌తో పదేళ్ల క్రితం వివాహం జరిగింది. వీళ్లకి ఇద్దరు పిల్లలు ఉన్నారు. పెళ్లయిన తర్వాత నుంచి అజ్మీరాబేగం, అత్త ఫర్జానాబేగంల మధ్య గొడవలు జరుగుతూనే ఉన్నాయి.
ఓ రోజు అత్త కోడలిని చాయ్ పెట్టమంది. కోడలు పిల్లలను పాఠశాలకు పంపే తొందరలో టీ పెట్టలేదు. పిల్లలను పాఠశాలకు పంపించి వచ్చిన తర్వాత ఇద్దరి మధ్య గొడవ ఇంకా పెరిగింది. తీవ్ర ఆగ్రహానికి గురైన అత్త.. కోడలు ధరించిన చున్నీని ఆమె మెడకి బిగించి హత్య చేసింది. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేరు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.