పుల్లారెడ్డి స్వీట్స్(Pulla Reddy Sweets)సంస్థ కుంటుంబం మళ్లీ వివాదాల్లో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ జూబ్లీహిల్స్(jubilee hills)లో కోట్ల విలువైన ప్లాట్ ను పుల్లారెడ్డి కుమారుడు రాఘవరెడ్డి కబ్జా చేశారని సమాచారం. నకిలీ ఆధార్ కార్డు, ఫేక్ పత్రాలతో ప్లాట్ కొనేందుకు ప్రయత్నించినట్లు తెలిసింది. అయితే బాధితులు జూబ్లీహిల్స్ పోలీసులకు ఆశ్రయించగా..రాఘవరెడ్డి, అతని కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది.
రాఘవరెడ్డి ప్రేమ్ కుమారి పేరుతో తప్పుడు ఆధార్ కార్డు సృష్టించారని తెలిసింది. కానీ ప్రేమ్ కుమారి మరణించిన ఐదేళ్లకు ఆధార్ కార్డ్ రావడం, కార్డుపై ముస్లిం యువతి ఫోటో ఉండటంతో రాఘవరెడ్డి అసలు స్టోరీ బయటకు వచ్చిందని బాధితులు అంటున్నారు. మరోవైపు రాఘవరెడ్డి భార్య భారతీరెడ్డి పేరుతో ప్రాపర్టీని కొనుగోలు చేసినట్లు ఫేక్ డాక్యుమెంట్లు తయారు చేశారని..దీంతోపాటు ఇంగ్లీష్ పేపర్లో ప్రకటన కూడా ఇచ్చారని పోలీసుల విచారణలో బయకొచ్చినట్లు తెలుస్తోంది.
ఇప్పటికే పుల్లారెడ్డి స్వీట్స్ యజమాని రాఘవరెడ్డి ఫ్యామిలీ వరకట్న వేధింపుల వివాదం తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇటీవల రాఘవరెడ్డి కోడలు ప్రజ్ఞారెడ్డి తనకు జరిగిన అన్యాయంపై రాష్ట్రపతి ద్రౌపతి ముర్మకు లేఖ కూడా రాశారు.