»Janhvi Kapoor If You Give 4 Crores Janhvi Kapoor Ready
Janhvi Kapoor: 4 కోట్లు ఇస్తే.. జాన్వీ కపూర్ రెడీ?
హాట్ బ్యూటీ జాన్వీ కపూర్‌కి నాలుగు కోట్లు ఇస్తే.. అందుకు సై అంటోందా? అంటే, అవుననే సమాధానం వినిపిస్తోంది. అలాగే.. పుష్పరాజ్‌కి షాక్ ఇచ్చిందా? అంటే, అవుననే మాట వినిపిస్తోంది. ఇంతకీ జాన్వీ కపూర్ నాలుగు కోట్లు ఎందుకు డిమాండ్ చేసింది.
Janhvi Kapoor: If you give 4 crores.. Janhvi Kapoor ready?
Janhvi Kapoor: ప్రస్తుతం దేవర సినిమాలో ఎన్టీఆర్ సరసన హీరోయిన్గా నటిస్తోంది జాన్వీ కపూర్. ఈ సినిమాతోనే టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. అయితే.. అమ్మడి క్రేజ్‌కు దేవర రిలీజ్‌కు ముందే రామ్ చరణ్‌తో ఆర్సీ 16లో ఛాన్స్ కొట్టేసింది. అయితే.. బ్యాక్ టు బ్యాక్ స్టార్ హీరోలతో ఆఫర్స్ అందుకుంటున్న జాన్వీ.. ఐటెం సాంగ్ చేస్తుందా? అంటే, ఛాన్సెస్ ఉన్నాయనే మాట కూడా వినిపిస్తోంది. పుష్ప సినిమాలో ఐటెం సాంగ్ ఎంత పాపులర్ అయిందో అందరికీ తెలిసిందే. ఊ అంటావా.. అంటూ అందరినీ ఊపేసింది సమంత.
ఇక ఇప్పుడు పెరిగిన అంచనాలకు మించి పుష్ప2లో ఐటెం సాంగ్ ప్లాన్ చేస్తున్నాడు సుకుమార్. ఇప్పటికే దేవిశ్రీ ప్రసాద్ అదిరిపోయే ట్యూన్ రెడీ చేసి పెట్టుకున్నాడు. ఈ ఐటెం సాంగ్‌లో స్టార్ బ్యూటీని రంగంలోకి దింపాలని చూస్తున్నాడు సుకుమార్. ఇప్పటికే దిశా పటానీ, త్రిప్తి డిమ్రి పేర్లు వినిపించగా.. జాన్వీ కూడా రేసులో ఉంది. ఇప్పటికే జాన్వీని పుష్ప2 మేకర్స్ సంప్రదించినట్టుగా తెలుస్తోంది. అయితే.. జాన్వీ ఈ పాట కోసం ఏకంగా 4 కోట్లు డిమాండ్ చేసిందని సమాచారం. అంటే.. నాలుగైదు నిమిషాల పాటకు నిమిషానికి కోటి డిమాండ్ చేసిందన్నమాట.
చెప్పాలంటే.. ఇది ఒక స్టార్ హీరోయిన్ రెమ్యూనరేషన్ కంటే ఎక్కువ. అలాంటప్పుడు.. ఒక్క పాట కోసం 4 కోట్లంటే మామూలు విషయం కాదు. అందుకే.. జాన్వీ డిమాండ్‌తో మేకర్స్ ఆలోచనలో పడినట్టుగా తెలుస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ వారు పుష్ప2 కోసం భారీగా ఖర్చు చేస్తున్నారు. కానీ ఆగష్టు 15 నుంచి డిసెంబర్ 6కి సినిమా పోస్ట్‌పోన్ అవడంతో.. నిర్మాతలపై అదనపు భారం పడుతోంది. మరి ఫైనల్‌గా పుష్పరాజ్‌తో చిందేసే ఛాన్స్ ఎవరికి వస్తుందో చూడాలి.