ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం రాజలింగాలకు చెందిన నల్లమోతు సందీప్‌కుమార్ ఐఏఎస్ అని చెప్పి పెళ్లి చేసుకున్నాడు. మోసం చేయడమే కాకుండా అదనపు కట్నం తీసుకురావాలని వేధించాడు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.
Hyderabad: ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం రాజలింగాలకు చెందిన నల్లమోతు సందీప్‌కుమార్ ఐఏఎస్ అని చెప్పుకున్నాడు. 2016లో కర్ణాటక ఐఏఎస్ క్యాడర్లో ఎంపికైనట్లు మ్యాట్ర్రీమోనీలో వివరాలు ఉంచాడు. ఇది చూసి బెల్జియంలో ఉద్యోగం చేస్తున్న ఏపీలోని కర్నూలు జిల్లాకి చెందిన అరిమిల్లి శ్రావణి కుటుంబీకులు అతనిని సంప్రదించారు. రూ.50 లక్షల కట్నం, ఇతర లాంఛనాలు ఇచ్చి 2018లో ఘనంగా పెళ్లి చేశారు. అయితే తనకు ఐఏఎస్ అధికారిగా పనిచేయడం ఇష్టం లేదని రేడియాలజిస్టుగా ఉద్యోగం చేస్తానని భార్యకు చెప్పి నిత్యం విధులకు వెళ్లి వస్తున్నట్లు నమ్మించాడు.
వీళ్లకి ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. అయితే సంపాదించినది ఏదని భార్య నిలదీసింది. దీంతో అతను వైద్యం ద్వారా తాను రూ.40 కోట్లు సంపాదించానని ఆదాయపన్ను చెల్లించకపోవడంతో అధికారులు బ్యాంకు ఖాతాను సీజ్ చేశారని చెప్పారు. అవి రావాలంటే రూ.2 కోట్లు చెల్లించాలనగా భార్య మిత్రుల ద్వారా డబ్బు సెట్ చేసింది. ఆ డబ్బును తన తండ్రి, సోదరి ఖాతాలకు బదిలీ చేశాడు. అయితే భర్త ఐఏఎస్ కాదని, అతని ధ్రువపత్రం నకిలిదని, అలాగే రేడియాలజీ సర్టిఫికేట్ నకిలీవని శ్రావణి గుర్తించింది. ఇంత జరిగిన తర్వాత కూడా అదనపు కట్నం తీసుకురమ్మని ఆమెను వేధించాడు. దీంతో ఆమె బాచుపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేశారు.