బాలీవుడ్ ఆఫర్ల గురించి హీరో అడివి శేష్ ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా తీసిన ‘మేజర్’ తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని అన్నాడు. అది పూర్తయిన తర్వాత మళ్లీ అటువంటి జోనర్ల జోలికి వెళ్లనని స్పష్టం చేశాడు. భవిష్యత్తులో యుద్ధ సినిమాలు లేదా బయోపిక్‌లు చేయనని తేల్చి చెప్పాడు. ‘మేజర్’ తర్వాత హిందీలో ఆరు ఆఫర్లు వచ్చినా వాటిని తిరస్కరించినట్లు తెలిపాడు.