Reduce Waist Size : పొట్ట చుట్టూ పేరుకున్న కొవ్వు తగ్గాలంటే.. ఇలా చేయండి!
ఇటీవల కాలంలో చాలా మంది ఒబెసిటీతో బాధ పడుతున్నారు. ఊబకాయం లేకపోయినా చాలా మందికి పొట్ట చుట్టుపక్కల కొవ్వు పేరుకుపోయి ఉంటుంది. దాన్ని తగ్గించుకునేందుకు ఉపయోగపడే కొన్ని చిట్కాలను నిపుణులు ఇక్కడ చెబుతున్నారు. చదివేయండి.
how to reduce belly fat naturally : ఇటీవల కాలంలో మారిన జీవన విధానాల వల్ల ప్రతి ఒక్కరూ బరువు సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. చాలా మందికి పొట్ట దగ్గర ఎక్కువగా కొవ్వులు(belly fat) పేరుకుపోయితూ ఉంటాయి. ఇలాంటి కొవ్వులు చాలా ప్రమాకరమైనవి. వీటి వల్ల మధుమేహం, గుండె జబ్బుల్లాంటివి వచ్చే అవకాశాలు పెరుగుతాయి. కాబట్టి తక్కువ పొట్ట ఉన్నప్పుడే అంతా ఆ కొవ్వుల్ని కరిగించుకునే ప్రయత్నం చేయాలి. వీటిని తగ్గించుకోవడానికి ఉపయోగపడే కొన్ని చిట్కాలను నిపుణులు చెబుతున్నారిక్కడ. మరింకెందుకాలస్యం మీరూ చదివేయండి.
ఇలా పొట్ట చుట్టూ పేరుకున్న కొవ్వుల్ని తగ్గించుకోవాలి అనుకునే వారు కొన్ని ఆహార నియమాలను పాటించాలి. జంక్ ఫుడ్ తినకూడదు. నూనెల్లో వేపించిన పదార్థాలకు దూరంగా ఉండాలి. మద్యాపానం అలవాటు ఉంటే మానుకోవాలి. జ్యూసులు( sugary drinks), శీతల పానీయాలు తాగకూడదు. అర్ధ రాత్రిళ్లు తినే అలవాటు ఉంటే మానుకోవాలి. కార్బోహైడ్రేట్లు, కొవ్వులు ఉన్న ఆహారం తక్కువగా తినాలి. బదులుగా ప్రొటీన్ ఫుడ్ తినే అలవాటు చేసుకోవాలి. పండ్లు, కూరగాయలు, ఆకుకూరల్ని తినాలి. వీటిల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి జీవ క్రియ వేగవంతం అవుతుంది. పొట్ట దగ్గర పేరుకున్న కొవ్వులు తొందరగా కరిగే అవకాశం ఉంటుంది.
పై ఆహార నియమాలను పాటించడంతో పాటు వ్యాయామం చేయాలి. పొట్ట దగ్గరి కొవ్వుల్ని తగ్గించేందుకు యోగాసనాలు బాగా పని చేస్తాయి. కాబట్టి ఓ పావుగంట పొట్ట తగ్గించే ఆసనాలు వేయాలి. బ్రిస్క్ వాకింగ్ అలవాటు చేసుకోవాలి. అవసరం అనుకుంటే నిపుణులైన యోగా ట్రైనర్ల సలహా తీసుకోవడం మంచింది. ఇలా అటు ఆహార నియమాలు, ఇటు వ్యాయామం రెండూ కలిపి చేసినప్పుడు మాత్రమే పొట్ట దగ్గర కొవ్వులు తగ్గుతాయి. అదే చిన్న వయసులో ఉన్న వారైతే నడుము చుట్టు రింగ్‌ని తిప్పే హూలా హూపింగ్ ఎక్సర్సైజుల్లాంటి వాటినీ ట్రై చేయవచ్చు.