»Cm Chandrababu Met Union Finance Minister Nirmala Sitharaman
CM Chandrababu: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మాల సీతారామన్‌తో సీఎం చంద్రబాబు భేటీ
ఢిల్లీ పర్యటనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు వరుసగా కేంద్రమంత్రులను కలుస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మాల సీతారామన్‌తో సమావేశమయ్యారు. ఏపీ ప్రధాన్యత గురించి వారితో చర్చంచారు.
CM Chandrababu met Union Finance Minister Nirmala Sitharaman
CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్లిన విషయం తెలిసిందే. గురువారం ప్రధాని నరేంద్ర మోడితో భేటీ అయ్యారు. ఏపీని కేంద్రం ఆదుకోవాలని, పోలవరం, రాష్ట్ర అభివృద్ధి కోసం నిధులు కెటాయించాలని మాట్లాడారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు డిమాండ్లను మోడి పరిగణలోకి తీసుకున్నట్లు జాతీయ మీడియా కథనాలు వెలువడ్డాయి. ఆయనతో మీటింగ్ అనంతరం వివిధ కేంద్ర మంత్రులను ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ నేపథ్యంలో కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్‌తో బాబు సమావేశమయ్యారు. ఈ భేటీలో ఆయనతో పాటు కేంద్రమంత్రులు పెమ్మసాని చంద్రశేఖర్, రామ్మోహన్ నాయుడు, ఏపీ ఆర్ధికమంత్రి పయ్యావుల కేశవ్, ఎన్డీఏ ఎంపీలు పాల్గొన్నారు.
ఎన్డీయే కూటమి భాగస్వామ్యంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, దాని కోసం కేంద్ర బడ్జెట్లో ఏపీ అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాలని చంద్రబాబు కోరారు. పార్లమెంట్లో పెట్టబోయే బడ్జెట్లో ఏపీకీ ప్రాధాన్యత ఇవ్వాలని, తగిన నిధుల కేటాయించాలని ఆర్ధికమంత్రి నిర్మాల సీతారామన్‌ను కోరారు. ఆంధ్రప్రదేశ్‌ను ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీదే ఉందని, ఈ విషయాన్ని బడ్జెట్ పెట్టేప్పుడు మర్చిపోవద్దని చంద్రబాబు కోరారు. ఇక ఆర్థిక మంత్రితో భేటీ అనంతంర కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డాతో సమావేశం కానున్నారు.