»Over 16 Lakh Affected As Floods Batter Assam More Rain On Cards
Floods : అస్సాంలో వరదల బీభత్సం.. 16లక్షల మంది నిరాశ్రయులు
ఈశాన్య భారత దేశంలోని అస్సాం రాష్ట్రంలో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఈ వరదల తాకిడికి మొత్తం 16.25 లక్షల మంది నిరాశ్రయులుగా మారినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ చదివేయండి.
Assam Floods Death Toll : అస్సాంలో వరుణుడు బీభత్సం సృష్టిస్తున్నారు. భారీగా కురుస్తున్న వర్షాలకు అక్కడ చాలా ప్రాంతాలు జలమయం అయ్యాయి. వరదల్లో చిక్కకున్నాయి. ఈ పరిణామాలతో బుధవారం ఎనిమిది మంది మృతి చెందారు. దీనితో ఈ ఏడాది ఇప్పటి వరకు అస్సాంలో వర్షాలు, వరదల వల్ల మరణించిన వారి సంఖ్య( DEATHS) 56కు చేరింది. ఇక ఇప్పటికీ అక్కడ చాలా ప్రాంతాలు జలమయం అయి ఉన్నాయి. దీంతో ఏకంగా 16.25 లక్షల మంది ప్రజలు నిరాశ్రయులైయ్యారు.
వరదల కారణంగా అక్కడ ప్రఖ్యాతి చెందిన కజిరంగ నేషనల్ పార్క్ కూడా నీట మునిగింది. టైగర్ రిజర్వ్ల్లాంటివి సైతం నీటితో నిండిపోయాయి. అక్కడ ఒక రైనోసారస్ సహా మొత్తం ఎనిమిది జంతువులు మృత్యువాత పడ్డాయని అధికారులు వెల్లడించారు. ఇక నిరాశ్రయులైన ప్రజలకు సౌకర్యాలు కల్పించేందుకు అక్కడి ప్రభుత్వం నిరంతరాయంగా శ్రమిస్తోంది. మొత్తం 515 వరద సహాయ శిబిరాలను ఏర్పాటు చేసింది. వాటిలో నాలుగు లక్షల మందికి పైగా నిరాశ్రయులు తలదాచుకుంటున్నారు. వరదల్లో చిక్కుకుపోయిన మొత్తం 8,400 మందిని సహాయక బృందాలు కాపాడాయి.
వరద బాధిత ప్రాంతాల్లో పంటలు మొత్తం నీట మునిగాయి. ఇప్పటి వరకు 42,478 హెక్టార్ల విస్తీర్ణంలో ఉన్న పంటలన్నీ నీటి పాలైనట్లు లెక్కలు చెబుతున్నాయి. ఇప్పటికీ 2,800 గ్రామాలు వరదల్లో చిక్కుకుకని ఉన్నాయి. మౌలిక వసతులు లేకుండా పోయాయి. రోడ్లు, వంతెనలు సైతం దెబ్బతిన్నాయి. దీంతో అస్సాం(ASSAM) ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ఆయా ప్రాంతాల్లో పర్యటించారు. దెబ్బతిన్న రోడ్లు, ఆనకట్టల్ని త్వరితగతిన మరమ్మతులు చేయిస్తామని తెలిపారు.