టర్కీ, సిరియాలను భారీ భూకంపం (turkey syria earthquake) అతలాకుతలం చేసింది. ఈ భూకంపం కారణంగా టర్కీలో గత వందేళ్లలో జరగని ఆస్తి, ప్రాణ నష్టం జరిగిందని చెబుతున్నారు. ఈ విపత్తు కారణంగా ఈ రెండు దేశాల్లో మరణాలు 40,000ను దాటింది.
టర్కీ, సిరియాలను భారీ భూకంపం (turkey syria earthquake) అతలాకుతలం చేసింది. ఈ భూకంపం కారణంగా టర్కీలో గత వందేళ్లలో జరగని ఆస్తి, ప్రాణ నష్టం జరిగిందని చెబుతున్నారు. ఈ విపత్తు కారణంగా ఈ రెండు దేశాల్లో మరణాలు 40,000ను దాటింది. కేవలం టర్కీలోనే 37,000 మృత్యువాత పడ్డారు. భూకంపం కారణంగా టర్కీలో భారీగా మరణాలు సంభవించాయని టర్కీ ప్రెసిడెంట్ రిసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ (turkey president) ప్రకటించారు. 1939లో వచ్చిన భూంకంపం కారణంగా 33,000 మంది చనిపోయారు. ఇప్పుడు దానిని దాటేసింది. ఇక సిరియాలో దాదాపు నాలుగువేల మంది చనిపోయారు. లక్షలాదిమంది గాయపడ్డారు. వేలాది ఇళ్లు నేలమట్టమయ్యాయి. వేలకొద్ది సంఖ్యలో హాస్పిటల్స్లో చికిత్స పొందుతున్నారు. భారత్ ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సహా వివిధ దేశాలు సహాయక చర్యల్లో పాల్గొన్నాయి. భూకంపం సంభవించిన వారం పది రోజుల తర్వాత కూడా శిథిలాల కింద నుండి కొంతమంది స్వరాలు వినిపిస్తున్నాయి. నీరు, ఆహారం లేక కొంతమంది శిథిలాల కింద ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు. టర్కీలోని కహ్రమాన్మరాస్లో 222 గంటల తర్వాత 42 ఏళ్ల మహిళను ప్రాణాలతో కాపాడారు. అడియామాన్లో 77 ఏళ్ల వృద్ధుడిని, 18 ఏళ్ల యువకుడిని 200 గంటల తర్వాత రక్షించారు. ఎన్డీఆర్ఎఫ్ (NDRF) సిబ్బంది 80 గంటల తర్వాత ఆరేళ్ల పాపను రక్షించారు. ఇలాంటి సంఘటనలు ఎన్నో వెలుగు చూస్తున్నాయి.
ఆపరేషన్ దోస్త్ (Operation Dost)
ఆపరేషన్ దోస్త్లో భాగంగా భారత సైన్యం (Indian Army) సహాయక చర్యల్లో పాల్గొన్నది. ఆర్మీ మేజర్ డాక్టర్ బీనా తివారి పేరు బాగా వినిపిస్తోంది. ఈమె ఇస్కంద్రన్లో భారత సైన్యం ఏర్పాటు చేసిన తాత్కాలిక హాస్పిటల్లో వైద్యురాలిగా సేవలు అందిస్తున్నారు. బాధితులకు సేవలు అందించడమే కాదు… వారిలో ధైర్యం నింపే ప్రయత్నాలు చేస్తున్నారు. యూపీకి చెందిన రాహుల్ చౌదరి టర్కీలో సేవలు అందిస్తున్నారు. ఇదే సమయంలో తనకు కొడుకు పుట్టడంతో టర్కీ చౌదరి అని పేరు పెట్టారు. వివిధ దేశాలు కూడా ఆపన్న హస్తం అందిస్తున్నాయి. ఐక్య రాజ్య సమితి ఇప్పటికే 50 మిలియన్ డాలర్ల సాయాన్ని అందిస్తోంది. సిరియా భూకంప బాధితులకు 400 మిలియన్ డాలర్ల మేర అవసరం ఉంటుందని తెలిపింది. టర్కీ, సిరియాల మధ్య అవసరమైన మేరకు క్రాస్ బార్డర్ సహకారం అవసరమని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకటించింది. రెండు లక్షల అరవై వేల మందికి పైగా సహాయం కోసం ఎదురు చూస్తున్నట్లు తెలిపింది.
దేశ చరిత్రలోనే కాదని.. మానవ చరిత్రలోనే అత్యంత దారుణ ప్రకృతి వైపరీత్యాన్ని ఎదుర్కొంటున్నామని టర్కిష్ ప్రెసిడెంట్ ఆవేదన వ్యక్తం చేసారు. దేశంలోని చివరి పౌరుడిని కాపాడే వరకు తాము నిరంతరంగా పని చేస్తూనే ఉంటామన్నారు.
ఈ భూకంపం తర్వాత మరణాలకు తోడు బతికున్న వారు కూడా వివిధ రకాల రోగాల బారిన పడుతున్నారు. షాక్కు గురైన కొంతమంది ఇప్పటికీ కోలుకోలేకపోతున్నారు. సొంతవారిని గుర్తు పట్టడం లేదు. భూకంపం ఎంతలా సంభవించిందంటే.. టర్కీలో ఓ ఆలివ్ తోట ఏకంగా రెండుగా విడిపోయి, లోయ ఏర్పాటు అయ్యేంతలా… ఈ దేశంలోని సౌత్ ఈస్ట్ ఆల్టినోజు జిల్లాలో ఆలివ్ తోట రెండుగా విడిపోయి, 984 అడుగుల లోయ ఏర్పడింది. ఇది సిరియా బార్డర్.