»Pollution 33 Thousand Deaths In The Country Every Year Due To Air Pollution
Pollution: వాయు కాలుష్యంతో దేశంలో ఏటా 33 వేల మరణాలు
ఢిల్లీలో ప్రతి ఏడాది 11.5 శాతం మరణాలు వాయు కాలుష్యం కారణంగా సంభవించి ఉండవచ్చని ఓ నివేదిక అంచనా వేసింది. కాలుష్యం కారణంగా దేశంలో ఎక్కువ మరణాలు సంభవిస్తున్న నగరం ఢిల్లీ అని తెలిపింది.
Pollution: 33 thousand deaths in the country every year due to air pollution
Pollution: ఢిల్లీలో ప్రతి ఏడాది 11.5 శాతం మరణాలు వాయు కాలుష్యం కారణంగా సంభవించి ఉండవచ్చని ఓ నివేదిక అంచనా వేసింది. కాలుష్యం కారణంగా దేశంలో ఎక్కువ మరణాలు సంభవిస్తున్న నగరం ఢిల్లీ అని తెలిపింది. అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, హైదరాబాద్, కోల్కతా, ముంబాయి, పుణె, సిమ్లా, వారణాసిలో అధ్యయనం చేశారు. ఈ నగరాల్లో ఏటా దాదాపు 33 వేల మరణాలు వాయు కాలుష్యం కారణంగా సంభవించి ఉండవచ్చని తెలిపింది. సిమ్లాలో అత్యల్పంగా 59 మంది మరణించారు. అక్కడ సంభవిస్తున్న మరణాల్లో ఇది 3.7 శాతానికి సమానం. మొత్తం పది నగరాల్లో నమోదైన మరణాల్లో 7.2 శాతం కాలుష్యం వల్లేనని తెలిపింది. పది నగరాల్లో పీఎం 2.5 కాలుష్య రేణువుల స్థాయి ప్రపంచ ఆరోగ్యసంస్థ ప్రామాణిక పరిమితులను మించాయని తెలిపింది.
సంవత్సరంలో 99.8 శాతం రోజులు ఇదే పరిస్థితి ఉంటుందని తెలిపింది. నగరాన్ని బట్టి మూడు నుంచి ఏడేళ్ల డేటా మాత్రమే లభించింది. మొత్తం 36 లక్షల మరణాలను అధ్యయనం చేశారు. మెషీన్ లెర్నింగ్ సాంకేతికతతో రూపొందించిన అత్యాధునిక పద్ధతుల ద్వారా పీఎం 2.5 రేణువుల స్థాయిలను అంచనా వేశారు. పీఎం 2.5 స్థాయిలు ప్రతీ క్యూబిక్ మీటరుకు 10 మైక్రోగ్రాములు పెరిగిన కొద్దీ మరణాలు 1.42 శాతం అధికమైనట్లు అధ్యయనం తెలిపింది. పది నగరాల డేటాను కలిపినప్పుడు ఈ పరిస్థితి ఉందని తెలిపింది. ఢిల్లీలో మరణాల సంఖ్య 0.31 శాతం పెరిగితే, బెంగళూరులో 3.06 శాతం పెరిగినట్లు తెలిపింది. పీఎం స్థాయిలు పెరిగినప్పుడు కాలుష్యం అధికంగా ఉన్న నగరాలతో పోలిస్తే తక్కువ ఉన్న వాటిల్లోనే మరణాలు ఎక్కువవుతున్నట్లు గుర్తించారు.