ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఈరోజు కాకినాడ జిల్లా గొల్లప్రోలులో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈక్రమంలో ఆయన మాట్లాడుతూ.. శాఖలపై అధ్యయనానికి కొంత సమయం తీసుకున్నానని, తక్కువ చెప్పి ఎక్కువ పని చేయాలనుకుంటున్నానని పవన్ కల్యాణ్ అన్నారు.
Pawan Kalyan: ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఈరోజు కాకినాడ జిల్లా గొల్లప్రోలులో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈక్రమంలో ఆయన మాట్లాడుతూ.. శాఖలపై అధ్యయనానికి కొంత సమయం తీసుకున్నానని, తక్కువ చెప్పి ఎక్కువ పని చేయాలనుకుంటున్నానని పవన్ కల్యాణ్ అన్నారు. గత ప్రభుత్వంలో పంచాయతీ నిధులు ఎటు వెళ్లాయో తెలియడం లేదన్నారు. వందల కోట్ల రూపాయిలతో రుషికొండలో ప్యాలెస్ కట్టడం కంటే.. అభివృద్ధి చేయవచ్చు అన్నారు. తన వైపు నుంచి ఎలాంటి అవినీతి ఉండదని తెలిపారు. క్యాంపు ఆఫీస్లో మరమ్మతులు చేయాలని అధికారులు అడిగితే ప్రస్తుతానికి ఏం చేయవద్దని చెప్పాను. అవసరమైతే కొత్త ఫర్నిచర్ నేనే తెచ్చుకుంటానని పవన్ తెలిపారు.
వేతనాల కోసం సచివాలయం సిబ్బంది పత్రాలపై సంతకాలు అడిగితే తనకి పెట్టాలనిపించలేదన్నారు. జీతం తీసుకునే పనిచేద్దామనుకున్నాను.. కానీ పంచాయతీరాజ్ శాఖలో నిధులు లేవు. వేలకోట్ల అప్పు ఉంది. ఇంత అప్పు ఉన్నప్పుడు నాలాంటివాడు జీతం తీసుకోవడం తప్పు అనిపించింది.. అందుకే జీతం తీసుకోకుండా పనిచేస్తానని తెలిపారు. గెలిచినందుకు ఆనందం లేదు. పనిచేసి మన్ననలు పొందితేనే ఆనందం ఉంటుందన్నారు. భారీ మెజారిటీతో గెలిపించిన పిఠాపురం ప్రజలకు ఎప్పుడూ రుణపడి ఉంటానని తెలిపారు. దేశంలో పిఠాపురాన్ని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దాలనేది తన కోరికను పవన్ కల్యాణ్ తెలిపారు