Gold and Silver Rates Today : బంగారం, వెండి ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. వరుసగా రెండో రోజూ వీటి ధరలు పెరిగాయి. శుక్రవారం ఈ రెండు లోహాల ధరల్లోనూ భారీగా పెరుగుదల కనిపించింది. దేని ధర ఎంత ఉందో ఇప్పుడు చూసేద్దాం. 24 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర శుక్రవారం రూ.844 పెరిగింది. దీంతో దేశీయ మార్కెట్లో పది గ్రాముల పసిడి ధర నేడు రూ.74,970కు చేరుకుంది.
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాదుల్లోనూ దీని ధర(Gold Rate) రూ.74,970గానే కొనసాగుతోంది. నగల్ని కొనుక్కోవాలని అనుకునే వారు మరి కొన్ని విషయాలనూ దృష్టిలో ఉంచుకోవాలి. బంగారు నగల్ని కొనే సమయంలో ఈ ధరకు అదనంగా జీఎస్టీ, మజూరీల్లాంటివి యాడ్ అవుతాయి. అలాగే ఈ ధర మార్కెట్ ప్రారంభ సమయంలో ఉన్నది మాత్రమే. ఆ తర్వాత మళ్లీ మరే అవకాశం ఉంటుంది.
వెండి ధర సైతం దేశీయ మార్కెట్లో శుక్రవారం భారీగా పెరిగింది. ఒక్కరోజే ఏకంగా రూ.1,180 ఎక్కువైంది. దీంతో కేజీ వెండి ధర నేడు (Silver Rate) రూ.93,400కు చేరుకుంది. విజయవాడ్, హైదరాబాద్, విశాఖపట్నం లాంటి నగరాల్లోనూ దీని ధర ఇలాగే కొనసాగుతోంది.
ఇక అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్, వెండి ధరలు సైతం క్రమంగా పెరుగుతున్నాయి. శుక్రవారం స్పాట్ గోల్డ్ ఏకంగా 28 డాలర్లు పెరిగింది. దీంతో దీని ధర ప్రస్తుతం 2362 డాలర్లకు చేరుకుంది. ఔన్సు వెండి ధర నేడు 30.62 డాలర్లుగా ఉంది.