అక్కినేని నాగార్జున తన కుమారుడు అఖిల్ పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపాడు. ‘పుట్టినరోజు శుభాకాంక్షలు అఖిల్. జీవితం పట్ల నీకున్న ఉత్సాహం, అభిరుచి నాకు చాలా ఇష్టం. ఈ ఏడాది నీకు అంతా శుభం జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’ అని తెలిపాడు. ఈ సందర్భంగా అఖిల్ ‘లెనిన్’ చిత్రంలోని ఓ పోస్టర్ను షేర్ చేశాడు. కాగా, ఈ మూవీ జూన్ 26న విడుదల కానుంది.