»New Zealand Fast Bowler Lockie Ferguson Has A Rare Record
Lockie Ferguson: న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ అరుదైన రికార్డు
న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ లాకీ ఫెర్గసన్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. టీ20 క్రికెట్లో అత్యంత అరుదైన రికార్డు నెలకొల్పాడు. న్యూ గినియాతో జరిగిన మ్యాచ్‌లో నాలుగు ఓవర్ల వేసిన ఫెర్గసన్ ఒక్క పరుగు కూడా ఇవ్వకుండా 3 వికెట్లు తీశాడు. కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో గినియా జట్టు కేవలం 78 పరుగులు మాత్రమే చేయగలిగింది.
New Zealand fast bowler Lockie Ferguson has a rare record
Lockie Ferguson: న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ లాకీ ఫెర్గసన్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. టీ20 క్రికెట్లో అత్యంత అరుదైన రికార్డు నెలకొల్పాడు. న్యూ గినియాతో జరిగిన మ్యాచ్‌లో నాలుగు ఓవర్ల వేసిన ఫెర్గసన్ ఒక్క పరుగు కూడా ఇవ్వకుండా 3 వికెట్లు తీశాడు. కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో గినియా జట్టు కేవలం 78 పరుగులు మాత్రమే చేయగలిగింది. కివీస్ బౌలర్ల ధాటికి కుప్పకూలింది. ఇప్పటికే టోర్నీ నుంచి నిష్క్రమించిన కివీస్ జట్టు…చివరి లీగ్ మ్యాచ్‌ను విజయంతో ముగించింది. టీ 20 వరల్డ్ కప్ బౌలర్లకు స్వర్గధామంగా నిలిచింది. వికెట్ల వేటను కొనసాగిస్తున్నారు. పెద్ద పెద్ద బ్యాటర్లను సైతం బెంబేలెత్తిస్తున్నారు. పరుగులు చేయకుండా కట్టడి చేస్తున్నారు. బౌలర్ల కారణంగా ఎక్కువ విజయాలు అందుకుంటున్నారు. వరల్డ్ కప్ కోసం తయారు చేసిన పిచ్‌లు బ్యాటర్లకు అనుకూలంగా లేకపోవడం…బౌలర్లకు బాగా కలిసి వచ్చింది.
జూన్ 17న కివీస్ జట్టు గినియా జట్టుతో తలపడింది. ఈ నామమాత్రపు మ్యాచ్‌లో న్యూజిలాండ్ జట్టు ఘన విజయం సాధించింది. కివీస్ బౌలర్ లాకీ ఫెర్గసన్..ఆ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. మొత్తం నాలుగు ఓవర్లు వేసిన ఫెర్గసన్ ఒక్కటంటే ఒక్క పరుగు కూడా ఇవ్వలేదు. ఈ క్రమంలో 3 వికెట్లు కూడా పడగొట్టాడు. ఫెర్గసన్ ధాటికి గినియా జట్టు కేవలం 78 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఇటువంటి ఘనత క్రికెట్ ప్రపంచంలో ఏ ఇతర బౌలర్‌కు కూడా దక్కలేదు. గతంలో ఓ సారి కెనడా ఆటగాడు …టీ 20 మ్యాచ్‌లో నాలుగు ఓవర్లు మేడిన్ ఓవర్లు వేశాడు. రెండు వికెట్లు కూడా తీసుకున్నాడు. ఇప్పటి వరకు అదే అరుదైన ఘనత అనుకుంటే ….ప్రస్తుతం అంతకు మించిన ఘనతను సొంతం చేసుకున్నాడు ఫెర్గసన్. తాను వేసిన మొత్తం 24 బంతుల్లో ఒక్కటంటే ఒక్క పరుగు కూడా ఇవ్వకుండా మూడు వికెట్లు పడగొట్టాడు. గినియాతో జరిగిన ఈ మ్యాచ్‌లో కివీస్ బౌలర్లు మొత్తం 83 డాట్ బాల్స్ వేశారు. తక్కువ టార్గెట్‌తో బరిలో దిగిన కివీస్ జట్టు …ఆడుతూ పాడుతూ లక్ష్యం చేరుకుంది. ఈ నామమాత్రపు మ్యాచ్‌లో ఎన్నో విశేషాలున్నాయి. కివీస్ బౌలర్ బౌల్ట్ టీ 20 క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు.