»Pakistan Win Over New Zealand Dls Method 35th Match
PAKvsNZ: ట్విస్ట్..న్యూజిలాండ్ పై పాకిస్థాన్ గెలుపు
వర్షం కారణంగా బెంగళూరులో జరిగిన న్యూజిలాండ్, పాకిస్థాన్ మ్యాచులో అనుహ్యాంగా డీఎల్ఎస్ పద్ధతిలో పాకిస్థాన్ జట్టు విజయం సాధించింది. అయితే మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 401 పరుగులు చేసినప్పటికీ చివరకి ఇలా జరగడం పట్ల కివీస్ అభిమానులు నిరాశ చెందారు.
Pakistan win over New Zealand dls method 35th match
2023 వన్డే ప్రపంచ కప్ 35వ మ్యాచ్ న్యూజిలాండ్, పాకిస్థాన్ జట్ల మధ్య జరుగగా సరికొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది. వర్షం కారణంగా డక్బర్త్ లూయిస్ పద్ధతిలో పాకిస్థాన్ జట్టు 21 పరుగుల తేడాతో న్యూజిలాండ్‌ను ఓడించి విజయం సాధించింది. దీంతో సెమీ ఫైనల్‌కు చేరుకోవాలనే ఆశలను పాక్ జట్టు సజీవంగా ఉంచుకుంది. ఈ ఆటకు వర్షం అంతరాయం కలిగించింది. ఆ క్రమంలో 41 ఓవర్లలో 342 పరుగుల సవరించిన లక్ష్యాన్ని కుదించారు. పాక్ జట్టు 25.3 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 200 పరుగులు చేసింది. అప్పటికే ఫఖర్ జమాన్ 126, బాబర్ 66 పరుగులు చేశారు. అయితే ఆ తర్వాత భారీ వర్షం కారణంగా మ్యాచ్ మొత్తం ఆడలేకుందా తయారైంది. దీంతో డక్బర్త్ లూయిస్ నిబంధనల ప్రకారం పాకిస్థాన్ జట్టు 21 పరుగుల ఆధిక్యంలో ఉంది. దీంతో పాకిస్థాన్ జట్టను విజేతగా ప్రకటించారు.
Ladies and gentleman congratulation to Pakistan, they won the match by DSR method.😂
All credit goes to Fakhar Zaman and babar Azam.♥️
And Qudrat ka Nizam with Pakistan.
Aggressive approach and captaincy by babar Azam and team Pakistan.♥️
Parchi
Pak vs Nz#PAKvsNZ#Babarpic.twitter.com/GZMGbynHzo
శనివారం జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో ఆరు వికెట్లకు 401 పరుగులు చేసింది. రచిన్ రవీంద్ర టోర్నమెంట్లో తన మూడవ సెంచరీ (94 బంతుల్లో 108), కేన్ విలియమ్సన్ (95 బంతుల్లో)తో కలిసి రెండో వికెట్‌కు 180 పరుగులు చేశారు. ఆ క్రమంలో మొదట బౌలింగ్ చేయాలనే పాకిస్థాన్ నిర్ణయం తప్పని అనుకున్నారు. కానీ చివరకు వర్షం కారణంగా పాకిస్థాన్ జట్టు పై చేయి సాధించింది. దీంతో పాకిస్థాన్ జట్టు ఐసీసీ పాయింట్ల పట్టికలో 8 పాయింట్లతో ఐదో స్థానానికి చేరుకుంది. మరోవైపు న్యూజిలాండ్ సైతం 8 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉండటం విశేషం.