»India Would Have Won The Cup If Modi Had Not Watched The Match
Modi మ్యాచ్ చూడకపోయి ఉంటే మరోలా ఉండేది: రాహుల్ గాంధీ
వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌కు ప్రధాని మోడీ వెళ్లకపోయి ఉంటే.. భారత్ కప్ గెలిచేందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆ కామెంట్లను బీజేపీ నేతలు తప్పు పట్టారు.
India would have won the cup if Modi had not watched the match
Rahul Gandhi: వన్డే వరల్డ్ కప్‌ను టీమిండియా చేజార్చుకుంది. రోహిత్ సేన గట్టి పోటీ ఇచ్చిందని.. నిజానికి మీరే విజేతలని ఆటగాళ్లపై ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) మాత్రం ప్రధాని మోడీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. అసలు.. మ్యాచ్ ఓడిపోవడానికి కారణం ఆయనే అంటున్నారు.
వరల్డ్ కప్ టీమిండియా గెలిచేది.. కానీ మ్యాచ్ చూసేందుకు ఓ చెడు శకనం అక్కడికి వచ్చిందని చెప్పారు. దాంతో మ్యాచ్ టర్న్ అయ్యిందని.. లేదంటే భారత్ కప్పు గెలిచేదని చెబుతున్నారు. మ్యాచ్ వీక్షించేందుకు ప్రధాని మోడీ వచ్చిన సంగతి తెలిసిందే. మోడీని ఉద్దేశించి పరోక్షంగా రాహుల్ గాంధీ (Rahul Gandhi) కామెంట్స్ చేశారు. రాజస్థాన్ ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ ఈ వ్యాఖ్యలు చేశారు. మోడీ చెడు శకునం అని.. అందుకే ఇండియా ఓడిపోయిందని చెప్పారు.
మోడీపై రాహుల్ చేసిన వ్యాఖ్యలను బీజేపీ ఖండించింది. రాహుల్ కామెంట్స్ అవమానకరం అని కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ మండిపడ్డారు. ఇవి అతని మానసిక అస్థిరతకు నిదర్శనం అని ధ్వజం ఎత్తారు. మ్యాచ్ ఓడిపోయిన దానికి, మోడీ రావడాన్ని జోడించి.. కామెంట్ చేయడం తగదన్నారు.
వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ ఆదివారం జరిగింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 240 పరుగులు మాత్రమే చేయగలిగింది. తర్వాత బ్యాటింగ్‌కు ఆసీస్.. ఆచి తూచి లక్ష్యాన్ని చేధించింది. భారత్ నుంచి కప్పు చేజారడంతో యావత్ క్రీడాభిమానులు షాక్‌నకు గురయ్యారు. ఇక ప్లేయర్లు అయితే కంటతడి పెట్టారు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఏడవగా.. చాలా మంది ప్రముఖులు మద్దతుగా నిలిచారు. మీరు కప్పు గెలిచేందుకు అర్హులు.. కొన్ని తప్పుల వల్ల కప్పు చేజారిందని అండగా ఉన్నారు.