Virat Kohli: ఐపీఎల్ సీజన్ 17లో సైతం బెంగళూరుకు వరుస పరాజయాలు ఎదురౌతున్నాయి. తాజాగా మరో లాస్‌తో ఆడిన నాలుగు మ్యాచ్‌లలో మూడు ఆటలు ఓడిపోయారు. సొంతమైదానం అయిన బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో లక్నో సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 28 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఇదిలా ఉంటే ఈ క్రమంలో విరాట్ కోహ్లీ అరుదైన ఘనత సాధించాడు. ఒకే వేదికపై 100 మ్యాచ్‌లు ఆడిన తొలి భారత క్రికెటర్‌గా రికార్డు సృష్టించాడు. ఈ ఆటలో 16 బంతుల్లో 22 పరుగులు సాధించాడు విరాట్. ఈయన తరువాత వరుసలో రోహిత్ శర్మ ముంబయిలోని వాంఖడే స్టేడియంలో 80 మ్యాచ్‌లు, ఆ తరువాత ఎంఎస్ ధోనీ చెపాక్ మైదానంలో 69 మ్యాచులు ఆడారు.
పరుగుల వీరుడు విరాట్ కొంత గ్యాప్ తరువాత ఐపీఎల్ ఆడుతున్నారు. వన్డే ప్రపంచ కప్‌లో మంచి ప్రదర్శన కనబరిచిన విరాట్ కోహ్లీ.. ఆ తరువాత టీ20ల మ్యాచ్‌కు దూరం ఉన్నారు. దాని తరువాత మళ్లీ నేరుగా ఐపీఎల్ ఆటలో పాల్గొన్నారు. ఇక్కడ సైతం అత్యుత్తమ ప్రతిభను కనబరుస్తూ యువ క్రికెటర్లకు ప్రోత్సాహాన్ని ఇస్తున్నాడు. ఈ నేపథ్యంలో విరాాట్ను పొట్టి వరల్డ్ కప్‌కు సైతం ఆడాలని పలువురు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ బ్రెట్ లీ కూడా ఇదే విషయంపై స్పందించాడు. టీ20 ప్రపంచ కప్‌లో పెద్ద స్టార్లు ఆడాలని అందులో విరాట్ కోహ్లీ ఆడాల్సిందే అని అన్నారు.