»First Session Of 18th Lok Sabha Likely To Commence On June 18
First Session Of 18th Lok Sabha: జూన్ 18నుంచి 18వ లోక్ సభ తొలి పార్లమెంట్ సమావేశాలు.. స్పీకర్ ఎన్నిక
దేశ 18వ లోక్సభకు ఎన్నికలు పూర్తయ్యాయి. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా పేరొందిన భారతదేశంలో ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్న తీరుపై ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
First Session Of 18th Lok Sabha: దేశ 18వ లోక్సభకు ఎన్నికలు పూర్తయ్యాయి. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా పేరొందిన భారతదేశంలో ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్న తీరుపై ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఆదివారం ప్రధానిగా మోదీ మూడోసారి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ఎన్నికల్లో దేశ ప్రజలు తమకు ప్రాతినిధ్యం వహించే 543 మంది ఎంపీలను ఎన్నుకున్నారు. జూన్ 18-19 తేదీల్లో దేశ 18వ లోక్సభకు ఎంపీలు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
18వ లోక్సభ తొలి పార్లమెంట్ సమావేశాలు జూన్ 18 నుంచి ప్రారంభం కానున్నాయి. జూన్ 18-19 తేదీల్లో ఎంపీల ప్రమాణ స్వీకారం, జూన్ 20న స్పీకర్ ఎన్నిక జరిగే అవకాశం ఉంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జూన్ 21న పార్లమెంట్ ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించవచ్చు. ఆదివారం సాయంత్రం జరిగే కేబినెట్ సమావేశంలో త్వరలో పార్లమెంట్ సమావేశాలను ఏర్పాటు చేసి ఉభయ సభల సంయుక్త సమావేశంలో ప్రసంగించాలని రాష్ట్రపతిని మంత్రివర్గం అభ్యర్థించనుంది.
నేడు మోదీ 3.0 తొలి కేబినెట్ సమావేశం
మూడోసారి ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రధాని మోదీ ఇవాళ మంత్రులందరితో సమావేశం కానున్నారు. ప్రధానితో పాటు 71 మంది మంత్రులు ప్రమాణం చేశారు. నేటి సమావేశంలో పేదలు, రైతుల కోసం మోదీ ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రకటనలు చేయనుంది. సాయంత్రం ఐదు గంటలకు ప్రధాని నివాసంలో ఈ సమావేశం జరగనుంది. అందుకోసం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈ భేటీ అనంతరం మంత్రులంతా బీజేపీ అధ్యక్షుడు జె. పి. నడ్డా వద్దకు రాత్రి విందుకు వెళ్తారు.
చరిత్ర సృష్టించిన ప్రధాని మోడీ
ప్రధాని నరేంద్ర మోదీ మూడోసారి భారత ప్రధానిగా చరిత్ర సృష్టించారు. దీనితో అతను మూడుసార్లు ప్రధానమంత్రి అయిన జవహర్లాల్ నెహ్రూ తర్వాత రెండవ నాయకుడు. ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత, పీఎం మోడీ సోషల్ మీడియాలో ఇలా వ్రాశారు, “140 కోట్ల మంది భారతీయులకు సేవ చేయడానికి .. భారతదేశాన్ని అభివృద్ధిలో కొత్త శిఖరాలకు తీసుకెళ్లడానికి మంత్రి మండలితో కలిసి పనిచేయడానికి నేను ఎదురుచూస్తున్నాను.’’ అంటూ రాసుకొచ్చారు.