ADB: ఇచ్చొడ మండలంలోని మల్యాల గ్రామ సర్పంచ్‌గా విజయం సాధించిన మెస్రం దేవురావు శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా నెరడిగొండ క్యాంపు కార్యాలయంలో బోథ్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆడే గజేందర్ వారికి కండువా కప్పి ఆహ్వానించారు. ఉప సర్పంచ్ బత్తుల పంజాబ్, బత్తుల కొటేశ్వర్, క్రాంతి, బొంగురాల శంకర్, తదితరులు ఉన్నారు.