NLR: నగరంలో శనివారం జరిగిన ప్రతిష్టాత్మక నేషనల్ లోక్ అదాలత్లో మొత్తం 74 కేసులను అధికారులు పరిష్కరించారు. లోక్ అదాలత్ ద్వారా సివిల్, కొన్ని క్రిమినల్, భార్యాభర్తల మధ్య ఉన్న కేసులలో కక్షిదారుల మధ్య సయోధ్య కుదిర్చి, ఇరు పక్షాలకు ఆమోదయోగ్యమైన పరిష్కారాలు లభించాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయమూర్తితో పాటు జిల్లా ఎస్పీ పాల్గొన్నారు.