W.G: పెనుగొండ మండలంలోని సిద్ధాంతం హైవేపై అక్రమంగా తరలిస్తున్న 30 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని శనివారం విజిలెన్స్, రెవెన్యూ, పౌర సరఫరాల అధికారులు సంయుక్తంగా పట్టుకున్నారు. విజిలెన్స్ ఎస్సై K.నాగరాజు ఆధ్వర్యంలో వాహనాన్ని తనిఖీ చేసి, బియ్యాన్ని గుర్తించారు. నిత్యావసర వస్తువుల చట్టం-1955 ప్రకారం కేసు నమోదు చేసి, వాహనాన్ని సీజ్ చేసినట్లు ఎస్సై తెలిపారు.