GNTR: తెనాలి జిల్లా ఆసుపత్రిలో స్క్రబ్ టైఫస్ జ్వర అనుమానిత లక్షణాలతో వచ్చిన 11 మందికి వైద్యులు శనివారం ర్యాపిడ్ కిట్లతో పాటు ఎలీసా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ అని తేలింది. వైద్యులు వెంటనే చికిత్స ప్రారంభించడంతో వీరంతా సురక్షితంగా ఉన్నారు. వీరిలో ఆరు నెలల గర్భిణీ కూడా ఉన్నారు. వైద్యుల నిరంతర పర్యవేక్షణలో రోగుల ఆరోగ్యం మెరుగుపడుతోంది.