ATP: గుత్తి మండలం వన్నెదొడ్డి గ్రామ సమీపంలో ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. ముందు వెళ్తున్న లారీని బెంగళూరు నుండి హైదరాబాద్కు వెళ్తున్న తెలంగాణ ఆర్టీసీ బస్సు ఓవర్ టెక్ చేయబోయాడు. ఆ సమయంలో మరో ప్రైవేట్ ట్రావెల్ బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. ఈ క్రమంలో బస్సు పాక్షికంగా దెబ్బతింది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.