Elon Musk: మోదీకి కంగ్రాట్స్ చెప్పిన ఎలాన్ మస్క్
టెక్ దిగ్గజం ఎలన్ మస్క్ భారత ప్రధాని మోడీకి శుభాకాంక్షలు తెలిపారు. తమ కంపెనీలో ఇండియాలో పని చేయడానికి ఆసక్తిగా ఉన్నట్లు ఆయన ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు.
Elon Musk: సార్వత్రిక ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన ప్రధాని మోడీకి ప్రపంచ టెక్ దిగ్గజం, బిలియనీర్ ఎలాన్ మస్క్ శుభాకాంక్షలు తెలిపారు. టెస్లా కంపెనీలు సైతం ఇండియాలో పనిచేయడానికి ఆసక్తిగా ఉన్నట్లు పోస్టు పెట్టారు. ప్రస్తుతం ఈ పోస్టు ఇంటర్నెట్లో తెగ వైరల్ అవుతుంది. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య ఎన్నికల్లో మోడీ మూడవ సారి విజయం సాధించినందుకు మస్క్ కంగ్రాట్స్ చెప్పారు. ఈ మేరకు ఎన్డీయే పక్షనేతగా కూటమి బలపరిచింది. దీంతో మోడీ ప్రధానిగా జూన్ 9వ తేదీన ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
టెస్లా కంపెనీ సీఈవో మస్క్ ఇటీవల ఇండియా టూర్‌ను రద్దు చేసుకున్నారు. తాజాగా మోడీకి విషెస్ చెప్పారు. ఏప్రిల్ 21, 22 తేదీల్లో ప్రధానిని కలివాల్సిన షెడ్యూల్‌ను మస్క్ రద్దు చేసుకున్నారు. 2023 జూన్‌లో మోడీ అమెరికా పర్యటనలో భాగంగా ఎలాన్ మస్క్‌ను కలిశారు. ఆయనతో పలు విషయాల గురించి చర్చించారు. అయితే 2024లో మస్క్ ఇండియాకు వస్తున్నట్లు అప్పట్లోనే ప్రకటించాడు. తాజా ట్వీట్‌తో త్వరలోనే మస్క్ ఇండియాకు వచ్చి తన కంపెనీలు టెస్లా, స్టార్ లింక్ వంటివి ఇక్కడ పనిచేసే విధంగా ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశం ఉందని తెలుస్తుంది.
Congratulations @narendramodi on your victory in the world’s largest democratic elections! Looking forward to my companies doing exciting work in India.