TG: ‘రైతు నేస్తం’ ద్వారా రైతులకు సాగు పద్ధతులపై అవగాహన పెంచాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. యూరియా యాప్ వల్ల సమయం ఆదా అవుతోందని రైతులు హర్షం వ్యక్తం చేశారు. భూసార పరీక్షల ఆధారంగా ఎరువులు వాడేలా ప్రోత్సహించేందుకు రాష్ట్రవ్యాప్తంగా 30 వేల మంది యువ వాలంటీర్లకు శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. రసాయనిక ఎరువుల వాడకం తగ్గించి, భూసారాన్ని రక్షించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.