Lok Sabha: ఈ సారి పార్లమెంటుకు 280 మంది కొత్త ఎంపీలు
దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల ఫలితాలు అందరినీ ఆశ్చర్య పరిచాయి. ఏ పార్టీకి కూడా స్పస్టమైన మెజారీటి రాకపోవడంతో ఎన్టీయే కూటమి అధికారాన్ని నిర్మిస్తుంది. ఈ నేపథ్యంలో ఓ ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. ఈ సంవత్సరం కొత్తగా 280 మంది ఎంపీలు ఎన్నికైనట్లు తెలుస్తుంది.
Lok Sabha: దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల ఫలితాలు అందరినీ ఆశ్చర్య పరిచాయి. ఏ పార్టీకి కూడా స్పస్టమైన మెజారీటి రాకపోవడంతో ఎన్టీయే కూటమి అధికారాన్ని నిర్మిస్తుంది. ఈ నేపథ్యంలో ఓ ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. ఈ సంవత్సరం కొత్తగా 280 మంది ఎంపీలు ఎన్నికైనట్లు తెలుస్తుంది. 18వ లోక్సభ( Lok Sabha) ఎన్నికల విజయాలు కొత్త ఎంపీలను పార్లమెంటుకు పంపిస్తున్నాయి. 2019లో 267 మంది కొత్త ఎంపీలు ఎన్నిక కాగా 2024లో ఆ సంఖ్యం పెరిగింది. ఈ ఎన్నికల్లో విజయం సాధించిన వారిలో 263 మంది ఇదివరకే ఎంపీలుగా పనిచేశారు.
పీఆర్ఎస్ లెజిస్టేటివ్ రీసర్చ్ సంస్థ ఈ డేటాను అందించింది. 8 మంది ఎంపీలు తమ నియోజకవర్గాన్ని మార్చుకొని మళ్లీ గెలిచారు. అలాగే రాహుల్ గాంధీ రెండు నియోజకవర్గాల నుంచి ఎన్నికైన విషయం తెలిసిందే. 17వ లోక్సభలో ఓ పార్టీ తరపున గెలిచిన ఎంపీలు ఈ ఏడాది పార్టీ మార్చి మళ్లీ గెలిచారు. ఈ ఎన్నికల్లో 53 మంత్రులు పోటీ చేయగా, దాంట్లో 35 మంది గెలిచారు. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ మొత్తం 240 సీట్లు గెలుచుకొని మొదటి స్థానంలో ఉండగా, 99 సీట్లతో కాంగ్రెస్ రెండవ స్థానంలో 37 సీట్లతో సమాజ్ వాదీ పార్టీ మూడవ స్థానంలో ఉంది.