»Here Is The Video Of A Knife Wielding Suspect In Germany
Viral News: కత్తితో ఓ యువకుడి వీరంగం.. సెన్సీటీవ్ పర్సన్స్ ఈ వీడియో చూడకండి
పబ్లిక్ ప్లేస్లో కత్తి పట్టుకొని ఓ వ్యక్తి నానా హంగామా చేశాడు. అడ్డుకున్న పోలీసులను సైతం పొడిచాడు. చూడడానికే భయానకంగా ఉంది ఈ వీడియో. నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది.
Here is the video of a knife-wielding suspect in Germany
Viral News: ఓ వ్యక్తి కత్తి పట్టుకొని సైకోలా అందరినీ పొడుస్తున్న వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది. అడ్డుకున్న పోలీసులను సైతం కత్తితో గాయపరిచాడు. ఓ ఆఫీసర్ మెడపై కత్తితో పొడిచాడు. ఈ వీడియో చూడాలంటే చాలా ధైర్యం ఉండాలంటే. సున్నిత మనస్కులు ఎవరు ఈ వీడియో చూడొద్దు. ఈ ఘటన జర్మనీలో చోటు చేసుకుంది. వీడియోలో చూసినట్లైతే.. ఈ దేశంలోని మాన్ హీమ్ నగరంలో ఓ అగంతకుడు కత్తితో విరుచుకుపడ్డాడు. ఓ మార్కెట్ వీధిలో కనిపించిన వారినల్లా కత్తితో పొడుస్తూ.. అడ్డుకోబోయిన పోలీసులను సైతం పొడిచేసరికీ సదరు పోలీసులు గన్తో కాల్చారు. దాంతో అతడు నెలపై పడ్డాడు. అతని వలన చాలా మంది కత్తిపోట్లకు గురైనట్లు వీడియో చూస్తే అర్థం అవుతుంది.
జర్మని టైమ్ ప్రకారం ఉదయం 11.30 గంటలకు ఈ సంఘటన చోటుచేసుకుంది. గాయపడిన తరువాత ఆ వ్యక్తిని సైతం ఆసుపత్రికి తీసుకెళ్ళి చికిత్స అందించి ఆపై కస్టడీకి తీసుకున్నారు. అతను ఎవరు ఎందుకు అలా రెచ్చిపోయి దాడి చేశాడు అనే విషయం ఇంకా తెలియలేదు. అయితే ఈ రోజు ఉదయం మాన్ హీమ్ నగరంలో ఇస్లామిక్ వ్యతిరేక ప్రచారకర్త మైఖేల్ స్టర్జెన్ బర్గర్ సారథ్యంలో ఓ కార్యక్రమం నిర్వహించినట్లు తెలుస్తుంది. అతన్ని వ్యతిరేకించిన ఈ నిందితుడు కత్తితో అరాచరం చేసినట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.