Bangalore Rave Party: బెంగళూరు రేవ్ పార్టీ… నటి హేమకు నోటీసులు..!
బెంగళూరు రేవ్ పార్టీ విచారణ కీలక మలుపు తిరిగింది. పాజిటివ్‌గా తేలిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులు నిర్ణయించారు. ఇందులో నటి హేమ కూడా పార్టీలో ఉన్నారని, డ్రగ్స్ కూడా సేవించారని రుజువైందందట. దీంతో.. విచారణకు రావాల్సిందిగా పోలీసులు ఇంతకుముందు ఆమెను కోరగా, ఆరోగ్య కారణాలను ఆమె నిరాకరించింది.
Bangalore Rave Party: బెంగళూరు ఫాం హౌస్‌లో జరిగిన రేవ్ పార్టీ కేసును విచారిస్తున్న సీసీబీ అధికారులు.. తెలుగు నటి హేమకు శనివారం నోటీసులు జారీ చేశారు. ఈనెల 27న సోమవారం విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. బెంగళూరు రేవ్ పార్టీ విచారణ కీలక మలుపు తిరిగింది. పాజిటివ్‌గా తేలిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులు నిర్ణయించారు. ఇందులో నటి హేమ కూడా పార్టీలో ఉన్నారని, డ్రగ్స్ కూడా సేవించారని రుజువైందందట. దీంతో.. విచారణకు రావాల్సిందిగా పోలీసులు ఇంతకుముందు ఆమెను కోరగా, ఆరోగ్య కారణాలను ఆమె నిరాకరించింది. ఆమె గైర్హాజరు కావడం పట్ల అధికారులు సంతృప్తి చెందకపోవడంతో జూన్ 1వ తేదీన తప్పకుండా హాజరుకావాలని మరోసారి నోటీసులు పంపినట్లు సమాచారం.
గత వారం అధికారులు ఛేదించిన రేవ్ పార్టీలో డ్రగ్స్ సేవించినట్లు తేలిన మొత్తం 86 మందిని సోమవారం విచారణకు హాజరుకావాలని బెంగళూరు పోలీస్ సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ (సిసిబి) నోటీసులు పంపింది. బెంగుళూరులోని ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలోని GR ఫామ్ హౌస్‌లో రేవ్ పార్టీ జరిగింది. 73 మంది పురుషులలో 59 మందికి పాజిటివ్‌గా రిపోర్ట్ వచ్చింది. 30 మంది మహిళల్లో 27 మందికి పాజిటివ్ వచ్చింది. 200కు పైగా టాలీవుడ్ చిత్రాల్లో నటించిన నటి హేమ (కృష్ణవేణి) కూడా పాజిటివ్‌గా తేలింది. బ్లడ్ రిపోర్టుల్లో ఆమె డ్రగ్స్ తీసుకున్నట్లు రుజువైంది. బెంగుళూరు రేవ్ పార్టీ డే అండ్ నైట్ పార్టీ . ఈ పార్టీకి 150 మందికి పైగా హాజరయ్యారు. పార్టీలో ఎండీఎంఏ, కొకైన్, హైడ్రోగాంజాను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.