»Harom Hara Trailer Launch Mahesh Babu For Brother In Law Once Again
Mahesh Babu: ‘హరోం హర’ ట్రైలర్ లాంచ్.. మరోసారి బావ కోసం మహేష్ బాబు!
సూపర్ స్టార్ మహేష్ బాబు మరోసారి తన బావ సుధీర్ బాబు కోసం రంగంలోకి దిగుతున్నాడు. సుధీర్ బాబు నటిస్తున్న కొత్త సినిమా ట్రైలర్ లాంచ్ చేయబోతున్నాడు మహేష్. మరి సుధీర్ బాబు ఈ సినిమాతో అయిన హిట్ కొడతాడా?
'Harom Hara' trailer launch.. Mahesh Babu for brother-in-law once again!
Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు బావగా సుధీర్ బాబు హీరోగా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఎస్ఎంఎస్ సినిమాతో హీరోగా కెరీర్ మొదలు పెట్టిన సుధీర్ బాబు.. టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. కానీ గత కొన్నాళ్లుగా సరైన సక్సెస్ అందుకోలేకపోతున్నాడు సుధీర్. అయినా కూడా నైట్రో స్టార్‌గా హిట్టు, ఫట్టుతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తునే ఉన్నాడు. లేటెస్ట్గా ఇప్పుడు హరోం హర అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వం వహించిన ఈ సినిమా జూన్ 14న థియేటర్లోకి రాబోతోంది. రిలీజ్ డేట్ దగ్గర పడడంతో హరోం హర ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు మేకర్స్. ఇప్పటికే విడుదల చేసిన పోస్టర్స్, గ్లింప్స్, సాంగ్స్ సినిమాపై మంచి హైప్ క్రియేట్ చేశాయి.
ఇక ఇప్పుడు హరోం హర మూవీ ట్రైలర్ రిలీజ్‌కు రెడీ అవుతున్నారు. ఈ ట్రైలర్‌ను మహేష్ బాబు లాంచ్ చేయనున్నారు. ముందు నుంచి సుధీర్ బాబుకు ఫుల్లుగా సపోర్ట్ చేస్తు వస్తున్నాడు మహేష్. సుధీర్ బాబు సినిమాలను ప్రమోట్ చేస్తు వస్తున్నాడు. ఏ సినిమా రిలీజ్ అయిన మహేష్ బాబు ఏదో ఓ రకంగా ప్రమోషన్ చేస్తుంటాడు. ఇక ఇప్పుడు హరోం హరతో హిట్ కొట్టాలని చూస్తున్న సుధీర్ కోసం మరోసారి రంగంలోకి దిగాడు. హరోం హర ట్రైలర్‌ను మహేష్ బాబు చేతుల మీదుగా లాంచ్ చేస్తున్నారు. మే 30న ఉదయం 11 గంటల 25 నిమిషాలకు హరోం హర ట్రైలర్‌ను సూపర్ స్టార్ మహేష్ బాబు లాంచ్ చేస్తారని మేకర్స్ ప్రకటించారు. దీంతో.. హరోం హర ట్రైలర్‌కు మంచి బజ్ రావడం గ్యారెంటీ. మరి సుధీర్ బాబు ఈసారైనా హిట్ కొడతాడేమో చూడాలి.