KMR: సీఎం కప్ రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీల్లో కామారెడ్డి జిల్లా జట్టు రన్నర్స్‌గా నిలిచింది. బీబీపేట్ మండలం తుజాల్‌పూర్‌కు చెందిన సుంకరి విష్ణు తేజగౌడ్ అద్భుత ప్రదర్శన చేశారు. రాష్ట్రస్థాయి పోటీల్లో రెండో బహుమతి సాధించిన జట్టును గ్రామస్తులు, స్నేహితులు అభినందనలు తెలిపారు. ఈ విజయం యువ క్రీడాకారులకు ప్రేరణగా నిలుస్తుందని వారు పేర్కొన్నారు.