SRD: జర్నలిస్టు అక్రిడేషన్ కార్డు దరఖాస్తుకు ఇంకా గడువు ఉందని టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు బండారు యాదగిరి చెప్పారు. ఇంకా జిల్లా స్థాయి అక్రిడేషన్ కమిటీ ఏర్పాటు కాలేదని కమిటీ ఏర్పాటు అయిన తర్వాత సమావేశం జరుగుతుందని పేర్కొన్నారు. జర్నలిస్టులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అర్హులైన ప్రతి ఒక్కరికి అక్రిడేషన్ కార్డులు అందుతాయన్నారు.