Prices of diabetes and heart disease medicines reduced by half
Tablets Prices: భారతీయులకు కేంద్రప్రభుత్వం శుభవార్త చెప్పింది. అన్ని మెడికల్ షాపులలో లభించే 41 రకాల మందుల ధరలను సగానికి పైగా తగ్గించే నిర్ణయం తీసుకున్నారు. అంతేకాకుండా షుగర్, గుండె జబ్బులు, కాలేయ సంబంధిత ఆరు రకాల చికిత్సలో వాడే మందుల ధరలు తగ్గిస్తున్నట్లు తెలుస్తుంది. తాజా నిర్ణయంతో డయాబెటిస్, ఇన్ఫెక్షన్లు, అలర్జీలు, ఒళ్లు నొప్పులు, కాలేయ సమస్యలు, యాంటాసిడ్స్, మల్టీవిటమిన్, యాంటీబయాటిక్ మందుల ధరలు భారీ స్థాయిలో తగ్గనున్నాయి. ఈ మేరకు డిపార్ట్మెంట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ అండ్ నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ (ఎన్పీపీఏ) నోటిఫికేషన్ విడుదల చేసింది.
దీంతో మన దేశంలోని చాలా మంది ఊపిరితీసుకునే పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా కేవలం భారత్‌లోనే 10 కోట్లమందికిపైగా షుగర్ బాధితులున్నారు. అందుకోసం ప్రతీ రోజు షుగర్ ట్యాబ్లెట్స్, ఇన్సులిన్ తీసుకుంటున్నారు. వీటిపై ఆధారపడే వారికి ధరల తగ్గింపు పెద్ద ఉపశమనం. డయాబెటిస్‌ను నియంత్రణలో పెట్టెందుకు తీసుకునే డపాగ్లిఫోజిన్ మెట్ఫార్మిన్ హైడ్రోక్లోరైడ్ ట్యాబ్లెట్ ధర ఇప్పుడు రూ. 30 ఉండగా, తాజా నిర్ణయంతో రూ. 16కు అందుబాటులోకి వస్తుంది.