Gold Rates Today : స్వల్పంగా తగ్గిన బంగారం, పెరిగిన వెండి ధరలు!
పసిడి ధరలు భారీగా పెరగడం, స్వల్పంగా తగ్గడం అన్నట్లుగా ట్రెండ్ నడుస్తోంది. చివరికి బంగారం, వెండి ధరలు రెండూ అప్ట్రెండ్లోనే నడుస్తున్నాయి. దేని ధర ఎంత ఉందనేది తెలుసుకోవాలంటే ఇది చదివేయండి.
Gold and Silver Rates Today : పసిడి ధర ఒక రోజు భారీగా పెరుగుతోంది. మరో రోజు స్వల్పంగా తగ్గుతోంది. దీంతో ఓవరాల్గా చూసుకున్నట్లైతే పసిడి పెరుగుతూనే ఉంది. మరి బంగారంపై పెట్టుబడి పెట్టాలని చూసేవారు దీని రోజు వారీ మార్కెట్ ధరను గమనిస్తూ ఉండటం అత్యవసరం. మరి ఇవాల్టి బంగారం, వెండి ధరలు ఎంత ఉందనేది ఇప్పుడు తెలుసుకుందాం. దేశీయ మార్కెట్లో 24 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర బుధవారం రూ.385 తగ్గి రూ.74,885కు చేరుకుంది.
హైదరాబాద్, ప్రొద్దుటూరు, విజయవాడ, విశాఖపట్నం తదితర ప్రధాన పట్టణాల్లోనూ పది గ్రాముల పసిడి ధర(Gold Rate) రూ.74,885గా కొనసాగుతోంది. ఈ ధరలు మార్కెట్ ప్రారంభ సమయంలో ఉన్నవని గుర్తుంచుకోవాలి. కొనుగోలుదారులు నగల్ని కొనుగోలు చేస్తున్నప్పుడు జీఎస్టీ, మజూరీల్లాంటివి అదనంగా తోడవుతాయని గమనించుకోవాలి.
ఇక దేశీయ మార్కెట్లలో వెండి ధరలు బుధవారం పెరిగాయి. కిలో వెండి ధర(Silver Rate) రూ.677 పెరిగి రూ.86,959కు చేరుకుంది. విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్, ప్రొద్దుటూరుల్లోనూ దాదాపు ఇదే ధరలు కొనసాగుతున్నాయి.
అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్, వెండి ధరలు స్థిరంగా కనిపిస్తున్నాయి. ఔన్సు పసిడి 2361 డాలర్లుగా, ఔన్సు వెండి ధర 28.60 డాలర్లుగా ఉంది.