ఏపీలో సార్వత్రిక ఎన్నికల ప్రచారం ఈరోజుతో ముగియనుంది. సీఎం జగన్ పిఠాపురంలోనే ఆయన చివరి ప్రసంగాన్ని ఇవ్వనున్నారు. ఇదే సందర్భంతో సినీ నటుడు రామ్ చరణ్ తేజ్ ఏపీలో అడుగుపెట్టారు. ఆయన పిఠాపురంలో పర్యటిస్తారా అనేది ఇప్పుడు అందరిలో ఆసక్తిగా మారింది.
Jagan's last meeting in Pithapuram.. Ram Charan in Rajahmundry.. Exciting atmosphere in AP.
APElections: ఏపీ రాజకీయాల్లో పిఠాపురం హాట్ టాపిక్‌గా నిలిచింది. దానికి కారణం అక్కడ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీచేయడమే. ఆయన్ను ఓడగొట్టాలని ఏపీ సీఎం, వైసీపీ అధినేత జగన్ ప్రణాళికలు రచిస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే ఒకే సామాజిక వర్గం నుంచి వైసీపీ అభ్యర్థి వంగ గీతను బరిలో దింపారు. అంతే కాదు ప్రచారం సైతం పోటాపోటీగా చేస్తున్నారు. వంగా గీత ఇదివరకే రెండు సార్లు పార్లమెంట్ సభ్యులుగా, శాసన సభ సభ్యులుగా చేసిన అనుభవం ఉంది. దీంతో ప్రజలను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. మరో వైపు కూటమి బలంతో జనసేన అభ్యర్థిగా పవన్ కల్యాణ్ చాలా బలంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఆయనకు మద్దతుగా టీడీపీ సీనియర్ నేత ఎస్వీఎస్ఎన్ వర్మ ఉన్నారు. ముఖ్యంగా పిఠాపురంలో ద్విముఖ పోటీ ఉండడంతో ఓటర్లు ఎవరిని ఎన్నుకుంటారు అనేది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్లకు ఆసక్తి నెలకొంది.
ఈ రోజు సాయంత్రం 6 గంటలతో ఎన్నికల ప్రచారం ముగుస్తుంది. ఈ సందర్భంగా జగన్ మర్ స్కెచ్ వేశారు. పిఠాపురంలోనే తన చివరి ప్రసంగాన్ని ప్లాన్ చేశారు. అందులో భాగంగా కాకినాడ పార్లమెంట్లోపి పిఠాపురంలో సాయంత్రం సభ నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆయన ఏం మాట్లాడుతారినేది ఆసక్తిగా మారింది. ఇదిలా ఉంటే ఈ రోజు సినిమా నటుడు, చిరంజీవి తనయుడు రామ్ చరణ్ రాజమండ్రికి వచ్చారు. పిఠాపురంలో బాబాయి తరఫున ప్రచారం నిర్వహిస్తారా లేదా అన్నది ఇప్పడు ఆసక్తిగా మారింది. ఇప్పటికే వరుణ్, తేజ్, సాయి ధుర్గ తేజ్ పవన్‌కు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. అలాగే చిరంజీవి సైతం వీడియో రూపంలో పిఠాపురం ప్రజలకు తన సందేశాన్ని ఇచ్చారు. పవన్ కల్యాణ్ జనం కోసం వచ్చిన నాయకుడు అని ఈ సారి ఆయన్ను గెలిపించండి అని కోరారు. ఈ నేపథ్యంలో రామ్ చరణ్ ఏపీ రావడంతో ఆయన అభిమానులతో సహా, కూటమి శ్రేణుల్లో కొంత ఉత్సాహం వచ్చిందనేది స్పష్టంగా తెలుస్తుంది. మరీ ఆయన పిఠాపురంలో తిరుగుతారా లేదా అనేది చూడాలి.