జీవితం మీద విరక్తితో ఓ తల్లి ఇద్దరు పిల్లలతో ఆత్మహత్య చేసుకుంది. భార్యాభర్తల మధ్య విడాకుల కేసు కోర్టులో నడుస్తుండటం వల్ల విరక్తి వచ్చి ఆత్మహత్య చేసుకుంది.
Suicide: జీవితం మీద విరక్తితో ఓ తల్లి ఇద్దరు పిల్లలతో ఆత్మహత్య చేసుకుంది. వైఎస్ఆర్ జిల్లా చెన్నూరు మండలంలోని ఉమామహేశ్వరికి శ్రీహరి అనే వ్యక్తితో 18 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీళ్లకి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. గత కొన్ని రోజుల నుంచి భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. అదే ప్రాంతంలో ఉమామహేశ్వరి తన ఇద్దరి పిల్లలతో కలిసి భర్తకు దూరంగా ఉంటుంది.
వీరిద్దరి గొడవలకు సంబంధించిన కోర్టులో కేసు కూడా నడుస్తోంది. అయితే కోర్టు కేసులు, తన భర్తకు దూరంగా ఉంటున్నాననే బాధతో ఆమెకు జీవితం మీద విరక్తి వచ్చింది. రైలు కిందపడి ఆత్మహత్య చేసుకుంటా అని నిన్న ఇద్దరు పిల్లలతో వెళ్లింది. అయితే భర్త శ్రీహరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. చివరికి వల్లూరు మండల కేంద్రంలో ఓ చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఉమాతో పాటు ఆమె కుమారుడు, కుమార్తె కూడా ఆత్మహత్య చేసుకున్నారు.