AP: పల్నాడు జిల్లా మాచర్ల పట్టణ సీఐ వెంకటరమణపై వేటు పడింది. ఇటీవల పరువు హత్యకు గురైన చౌడేశ్వరి తల్లిదండ్రుల వద్ద డబ్బులు తీసుకొని ఆమెను బలవంతంగా అప్పగించినట్లు సీఐపై ఆరోపణలు వచ్చాయి. ఈ పరువు హత్యలో తల్లిదండ్రులతో పాటు వెంకటరమణ పాత్ర ఉందని తేలడంతో అధికారులు చర్యలు తీసుకున్నారు. వెంకటరమణను సస్పెండ్ చేస్తూ ఎస్పీ కృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు.