Sahithi Adapa: కేవలం పాటకోసమో గోదావరిఖని ప్రాంతం నుంచి హైదరాబాద్‌కు వచ్చిపోయేదాన్ని అలా 6 సంవత్సరాలు చేశాను అని సాహితి అడప తెలిపారు. సండే మొత్తం జర్నీకే పోయేది, ఈ ప్రాసెస్‌లో పేరెంట్స్ అండ్ మాస్టర్ ఎంతో ప్రోత్సహించారు అని పేర్కొన్నారు. తమ పేరెంట్స్‌ది గుంటూరు ప్రాంతం అని చెప్పారు. అమ్మ కూచిపూడి డ్యాన్సర్ అని సాహితి తెలిపారు. మొదటి అన్నయ్య నేర్చుకునేవారు, ఆయనతోపాటు మ్యూజిక్ క్లాస్‌లకు వెళ్లి హమ్ చేస్తుంటే అక్కడ మాస్టర్ చూసి మంచి వాయిస్ ఉందని నన్ను ప్రోత్సహించారు. అలా సాంగ్స్ పై ఇంట్రెస్ట్ పెరిగింది. దీని కంటే ముందే బోల్ బేబీ అనే ప్రోగ్రమ్తో ఫస్ట్ కెమెరా ఫేస్ చేసినట్లు వివరించారు. ఇక సూపర్ సింగర్‌కు అవకాశం ఎలా వచ్చిందో చెప్పారు. ఇక ఆ షోలో జరిగిని అనేక ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. సాహితి అడప గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవాలంటే ఈ వీడియో పూర్తిగా చూసేయండి.