Devi Sri Prasad: ఎట్టకేలకు స్టార్ సింగర్ చెల్లిని పెళ్లి చేసుకోబోతున్న దేవిశ్రీ ప్రసాద్ ?
దేవి సినిమాతో కెరీర్ స్టార్ చేసి అంచెలంచెలుగా ఎదిగారు. దేవి చేసిన ప్రతి పాట హిట్టే... కేవలం దేవిశ్రీప్రసాద్ అందించిన పాటలతో హిట్టైన సినిమాలు ఎన్నో ఉన్నాయి. క్లాస్, మాస్ బీట్స్‌తో భారీగా అభిమానులను సంపాదించుకున్నాడు.
Devi Sri Prasad: సంగీత ప్రియులకు మ్యూజిక్ డైరక్టర్ దేవి శ్రీ ప్రసాద్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఆయన సంగీతానికి మైమరచిపోని వారుండరు. కొన్నేళ్లుగా మ్యూజిక్ వరల్డ్ ను ఏలేస్తున్నారు. దేవి సినిమాతో కెరీర్ స్టార్ చేసి అంచెలంచెలుగా ఎదిగారు. దేవి చేసిన ప్రతి పాట హిట్టే… కేవలం దేవిశ్రీప్రసాద్ అందించిన పాటలతో హిట్టైన సినిమాలు ఎన్నో ఉన్నాయి. క్లాస్, మాస్ బీట్స్‌తో భారీగా అభిమానులను సంపాదించుకున్నాడు. ప్రస్తుతం తెలుగులో దేవీ హవా తగ్గిందనే చెప్పుకోవాలి. మళయాళ ఇండస్ట్రీకి చెందిన మ్యూజిక్ డైరక్టర్లు ఇప్పుడు టాలీవుడ్లో సత్తా చాటుతున్నారు.
అయితే కెరీర్ కాస్త నిమ్మదించినా అవకాశాలు తగ్గలేదు. పలు భాషల్లో సినిమాలు చేస్తూనే ఉన్నారు. కెరీర్ ఆశాజనకంగానే ఉన్న దేవీ ఇంకా పెళ్లి చేసుకోలేదు. ప్రస్తుతం దేవి నాలుగు పదుల వయసులో పడ్డాడు. ఇప్పటికే చాలా సార్లు దేవిశ్రీప్రస్తాద్ పెళ్లి వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. గతంలో హీరోయిన్ తో పెళ్లంటూ.. సీక్రెట్ గా పెళ్లి కూడా చేసుకున్నారని వార్తలు హల్ చల్ చేశాయి. కానీ అవి పుకార్లని తేలిపోయాయి. మళ్లీ ఇన్నాళ్లకు దేవిశ్రీప్రసాద్ పెళ్లి వార్త వైరల్ అవుతోంది. త్వరలో స్టార్ సింగర్ చెల్లిని పెళ్లి చేసుకోబోతున్నాడంటూ ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం టాలీవుడ్‌ని సింగర్ మంగ్లీ తన పాటలతో ఉర్రూతలూగిస్తున్న సంగతి తెలిసిందే. పుష్ప సినిమాలో ఉ అంటావా పాట పాడిన ఆమె సోదరి ఇంద్రావతిని పెళ్లి చేసుకుంటున్నారంటూ ప్రచారం జరుగుతోంది. దీనిపై అటు దేవి, కానీ ఇంద్రావతి కానీ స్పందించలేదు.