BDK: ఆళ్లపల్లి మండలంలో కలెక్టర్ అంకిత్ శనివారం పర్యటించారు. మండలంలోని పలు ప్రభుత్వ శాఖల కార్యాలయాలను పరిశీలించి, సేవల అమలు తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ప్రభుత్వ వైద్య శాలను తనిఖీ చేసి, రోగులకు అందుతున్న వైద్య సేవలు, మందుల లభ్యతపై సమీక్షించారు. అధికారులు విధులు సక్రమంగా నిర్వహించి, ప్రజలకు అందుబాటులో ఉండాలని పేర్కొన్నారు.