HYD: ఆక్రమణల కూల్చివేతపై GHMC ప్రత్యేక డ్రైవ్ వేగవంతమైంది. HYDలో ట్రాఫిక్ సాఫీగా సాగేందుకు, ప్రజా స్థలాలను పరిరక్షించేందుకు పలు ప్రాంతాల్లో అధికారులు చర్యలు చేపట్టారు. కమిషనర్ ఆర్.వి.కర్ణన్ జాంబాగ్, గోషామహల్ ప్రాంతాల్లో నిర్వహణను పరిశీలించి, డ్రైవ్‌ను క్రమబద్ధంగా కొనసాగించాలని సూచించారు. ఆక్రమణలేని రహదారుల ద్వారా ప్రజలకు సౌకర్యవంతమైన రవాణా కల్పించవచ్చని అన్నారు.