తిరుపతి: శ్రీకాళహస్తి టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో DSP నరసింహమూర్తి ఆధ్వర్యంలో సీఐ నాగార్జున రెడ్డి తన సిబ్బందితో కలిసి తిరుపతి-నాయుడుపేట బైపాస్‌లో బ్రీత్ అనలైజర్‌తో తనిఖీలు చేశారు. తిరుపతి నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సు డ్రైవర్ జానయ్య మద్యం సేవించినట్లు గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరచగా 12 రోజులు జైలుశిక్ష విధించారు.