»Vijay Antony If Telugu Language Had Come He Would Have Left Chennai And Made Films Here
Vijay Antony: తెలుగు భాష వచ్చి ఉంటే చెన్నై వదిలి ఇక్కడే సినిమాలు చేసేవాణ్ని!
విజయ్ ఆంటోని వైవిధ్యభరితమైన థ్రిల్లర్ కథలతో ప్రేక్షకులను అలరిస్తుంటారు. విజయ్ ఆంటోని తొలిసారి రొమాంటిక్ జానర్లో లవ్ గురు అనే మూవీ చేశారు. ఆయనే స్వయంగా నిర్మించిన చిత్రం ఈ నెల 11న విడుదల కానుంది. ఈక్రమంలో విజయ్ ఆంటోని కొన్ని విషయాలు తెలిపారు.
Vijay Antony: విజయ్ ఆంటోని వైవిధ్యభరితమైన థ్రిల్లర్ కథలతో ప్రేక్షకులను అలరిస్తుంటారు. అయితే విజయ్ ఆంటోని తొలిసారి రొమాంటిక్ జానర్లో లవ్ గురు అనే మూవీ చేశారు. ఆయనే స్వయంగా నిర్మించిన ఈ చిత్రాన్ని వినాయక్ వైద్యనాథన్ తెరకెక్కించారు. ఈ సినిమా ఈ నెల 11న విడుదల కానుంది. ఈక్రమంలో విజయ్ ఆంటోని కొన్ని విషయాలు తెలిపారు. తనకు మెమొరీ పవర్ చాలా తక్కువని.. అందుకే తెలుగు భాష నేర్చుకోలేకపోయానని తెలిపారు.
తెలుగు వచ్చి ఉంటే నేరుగా తెలుగులోనే సినిమాలు చేస్తేవాణ్ని. అలాంటి అవకాశం ఉంటే చెన్నై వదిలి వచ్చి ఇక్కడే సినిమాలు చేస్తా. ప్రస్తుతం మా ప్రొడక్షన్లో మూడు చిత్రాలు లైనప్లో ఉన్నాయన్నారు. ఇక బిచ్చగాడు 3 సినిమా 2026 వేసవిలో ప్రేక్షకుల ముందుకు రానుందని తెలిపారు. అలాగే వ్యక్తిగతంగా విజయ్ భవిష్యత్తు గురించి ఆలోచించకుండా.. వర్తమానంలోనే జీవిస్తుంటారని తెలిపారు. కోరుకున్నవి దక్కవు. వాటివల్ల మనకి నిరాశే మిగులుతుంది. మనకు ఏది కావాలో ఏది ఇవ్వాలో విశ్వం చూసుకుంటుంది. సినిమా విషయంలోనూ ఇలాగే ఆలోచించా అని తెలిపారు.