మద్యం కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అతను తిహార్ జైల్లో ఉన్నారు. అయితే ఈడీ తన అరెస్టును సవాల్ చేస్తూ కేజ్రీవాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
Arvind Kejriwal: మద్యం కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అతను తిహార్ జైల్లో ఉన్నారు. అయితే ఈడీ తన అరెస్టును సవాల్ చేస్తూ కేజ్రీవాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈడీ వద్ద ఆధారాలున్నాయని.. అందుకే పిటిషన్‌ను కొట్టివేస్తున్నట్లు న్యాయస్థానం తెలిపింది. అరెస్టు, రిమాండ్ చట్టవిరుద్ధం కాదని న్యాయస్థానం తెలిపింది. హవాలాపై ఈడీ ఆధారాలు చూపించిందని, గోవా ఎన్నికలకు డబ్బు ఇచ్చినట్లు అఫ్రూవర్ చెప్పారని హైకోర్టు తెలిపింది. సీఎంకు ఒక న్యాయం, సామాన్యులకు మరొక న్యాయం ఉండదని తెలిపింది.
మద్యం విధానం కేసులో మార్చి 21న కేజ్రీవాల్‌ను ఈడీ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసింతే. ఆ తర్వాత కొన్ని రోజుల పాటు ఈడీ తమ కస్టడీలోకి తీసుకుని విచారించి ఆ తర్వాత ఏప్రిల్ 15 వరకు జ్యుడిషియల్ రిమాండ్‌లో భాగంగా జైలులో ఉంటున్నారు. ఈ నేపథ్యంలో తన అరెస్టును సవాల్ చేస్తూ మధ్యంతర ఉపశమనం కల్పించాలని కేజ్రీవాల్ వేసిన పిటిషన్‌పై ఇటీవల విచారణ జరిపిన దిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ స్వర్ణకాంత శర్మ ధర్మాసనం మంగళవారం తీర్పు వెల్లడించింది. అది వ్యతిరేకంగా ఉండటంతో కేజ్రీవాల్ తాజాగా సుప్రీంకోర్టును ఆశ్రయించారు.