కర్బూజా వేసవిలో శరీరానికి అమృతం వంటిది. ఇందులో 90 శాతానికి పైగా నీరు ఉండటం వల్ల డీహైడ్రేషన్ బారిన పడకుండా కాపాడుతుంది. ఇందులోని విటమిన్ ఏ, సి రోగనిరోధక శక్తిని పెంచడమే కాకుండా చర్మం, కళ్ల ఆరోగ్యానికి మేలు చేస్తాయి. లైకోపీన్ అనే యాంటీ ఆక్సిడెంట్ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అధిక బరువు తగ్గాలనుకునే వారికి, జీర్ణక్రియ సాఫీగా సాగడానికి ఇది ఉపయోగపడుతుంది.